
EC Vs Rahul: ఓట్ల చోరీ అంటూ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. అవన్నీఅసత్యాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలని మండిపడింది. తాజా కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేశారు. కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక ఓటరు రెండుసార్లు ఓటు వేశారంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈసీ ఈ నోటీసు జారీ చేసింది. ఆరోపణకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను సమర్పించాలని రాహుల్‌ను ఈసీ తన నోటీసులో కోరింది.
ఈసీ లేఖలో ఏం ఉదంటే?
ఈసీ రాసిన లేఖలో రాహుల్ తాజా ప్రెస్ మీట్ ను ప్రస్తావించింది. ఆ ప్రెస్ మీట్ లో భాగంగా రాహుల్ కొన్ని పత్రాలు EC డేటా అన్నారు. ఓటరు శకున్ రాణి పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ఆధారంగా రెండుసార్లు ఓటు వేశారని రాహుల్ ఆరోపించారు. ఒక ఓటర్ IDని రెండుసార్లు ఓటు వేయడానికి ఉపయోగించారు.. టిక్ మార్కులను పోలింగ్ బూత్ అధికారి పెట్టారన్నారు. విచారణలో శకున్ రాణి తాను ఒక్కసారి మాత్రమే ఓటు వేశానని చెప్పిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాహుల్ గాంధీ చూపించిన టిక్ మార్క్ ఉన్న పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని, ఇది రాహుల్ వాదనకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈసీ తెలిపింది. అందుకే.. సంబంధిత పత్రాలను అందించాలని కోరుతున్నట్లు వెల్లడించింది. దాని ఆధారంగా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారా? అనే దర్యాప్తు కొనసాగిస్తామన్నది. రాహుల్ గాంధీ వచ్చిన నోటీసుకు స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను గౌరవిస్తుందని.. అవసరమైన పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.
Read Also: భారత్ దాదాగిరిని సహించదు, అమెరికాపై నితిన్ గడ్కరీ ఆగ్రహం!