ఆంధ్ర ప్రదేశ్
Trending

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలెర్ట్… భారీ వాహనాలకు అనుమతి లేదు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఈనెల 26వ తారీకున మహాశివరాత్రి సందర్భంగా పోలీస్ అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. పెద్ద ఎత్తున భక్తులు శివరాత్రికి శ్రీశైలం వెళుతుండడం మనం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే శివరాత్రి పండుగ ముందు రోజు నుంచి భారీ వాహనాలను దారి మళ్ళీ ఇస్తామని DSP నాగరాజు తెలిపారు. ఆత్మకూరు మరియు నంద్యాల వైపు వెళ్లే భారీ వాహనాలకు దోర్నాల మీదుగా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వాళ్లంతా కూడా పెద్దారవీడు మండలం కుంట జంక్షన్ నుంచి గిద్దలూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఇక 25వ తేదీ సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలకు శ్రీశైలం ఘాట్ లోకి అనుమతి ఉండదని తెలిపారు. ద్విచక్ర వాహనాల మీద వచ్చే ప్రతి ఒక్కరు కూడా మల్లికార్జున నగర్లో పార్కు చేసి బస్సుల్లో వెళ్లాలని తెలిపారు.

మనస్థాపానికి గురై… “చనిపోతున్న అమ్మ”అంటూ నోట్ బుక్ లో రాసి సూసైడ్ చేసుకున్న 8వ తరగతి విద్యార్థి!..

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు తెలియజేశారు. మరోవైపు శివరాత్రి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం తరలివచ్చేటువంటి అవకాశం ఉండడంతో మార్గమధ్యలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ వాహనాలను దారి మళ్లించారు. ఇక శ్రీశైలం ఘాట్ రోడ్డు మొత్తం కూడా అడవితో కూడుకున్న ప్రాంతం కాబట్టి వన్యప్రాణులతో ద్విచక్ర వాహనాలపై వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాటికి అనుమతులు ఇవ్వలేదు. కాబట్టి ముందస్తు చర్యలలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటించాలని డిఎస్పీ నాగరాజు తెలిపారు. రద్దీ ఎక్కువ కారణంగానే ఇలాంటి మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ నియమాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుముఖం… కానీ భారత్ లో డిఫరెంట్:Aon సర్వే

కెసిఆర్ పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button