
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- అనారోగ్య బారిన పడితే ఎవరైనా సరే ఆసుపత్రులకు వెళ్తారు. అన్ని ఆసుపత్రులకు తిరిగినా ఆ జబ్బు నయం కాకపోతే.. ఇక చివరిగా దేవుడి మీదనే భారం వేస్తారు. వివిధ రకాలుగా మొక్కుకొని.. ఆ సమస్యలు తీరితే మొక్కులను చెల్లిస్తామని దేవతలకు మొక్కుకుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన తంగరాజ్ అనే లారీ డ్రైవర్ తనకున్న అనారోగ్య సమస్యలు తీరిపోవడం వల్ల అమ్మోరికి ఇచ్చిన మాట ప్రకారం 151 మేకలను బలిచ్చాడు.
Read also : ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. నాకు తెలుగొచ్చు : VTV గణేష్
ధర్మపురి జిల్లా, పెన్నాగరం ఏరియాకు సమీప దూరంలో ఉన్న అత్తి మరుత్తూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తంగరాజ్ అనే లారీ డ్రైవర్ గత ఆరు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నాడు . ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కూడా.. ఆ జబ్బు అనేది నయం కాలేదు. దీంతో చేసేదేమి లేక దేవుడే దిక్కు అనుకొని.. పెన్నాగరం సమీపంలో బి. అగ్రహారం లోని ముత్తు మరియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం నా అనారోగ్య సమస్యలు తీరిపోతే 151 మేకలను బలిస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం పూర్తిగా బాగవడంతో ఏకంగా 10 లక్షల రూపాయలతో 151 మేకలను కొనుగోలు చేసి… ఆలయం ప్రాంగణంలో అమ్మవారికి 151 మేకలను బలి ఇచ్చాడు తంగరాజ్. ఆ తరువాత అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మాంసాహారంతో విందు ఇచ్చాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ప్రతి ఒక్కరు దీని గురించి చర్చిస్తున్నారు.
Read also : దుఃఖంలో కుటుంబం.. ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ నేతలు!