
పెళ్లైన ప్రతి జంటకు తప్పనిసరిగా పిల్లలు ఉండాలనే నియమమేదీ లేదని ప్రముఖ నటి వరలక్ష్మి స్పష్టం చేశారు. పిల్లలను వద్దనుకోవడంపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె మరోసారి పూర్తి క్లారిటీ ఇచ్చారు. “నాకు పిల్లలు పుట్టరని కాదు, నాకు పిల్లలు కావాలనిపించడం లేదు. ఇది నేను ఆలోచించి తీసుకున్న స్పష్టమైన, దృఢమైన నిర్ణయం” అని ఆమె తెలిపారు. కేవలం పిల్లలను పెంచడానికి ఆర్థికంగా బాగుంటే సరిపోదని, వారికి తగినంత సమయం కేటాయించడంతో పాటు ఎంతో ఓర్పు ఉండాలని వరలక్ష్మి పేర్కొన్నారు.సమాజం ఏమనుకుంటుందోనని లేదా కేవలం సమాజం కోసం మాత్రమే ఆ బాధ్యతను బలవంతంగా తీసుకోవద్దని ఆమె సూచించారు. నటి వరలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.