
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్ లో అన్ని జట్లు కూడా చాలా బాగా తలపడుతున్నాయి. అయితే ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా ఒక రోబో డాగ్ నిలిచింది. మ్యాచ్ ప్రారంభమయ్య సమయంలో, టాస్ సందర్భంగా కెప్టెన్లతో పాటుగా గ్రౌండ్లో ఈ రోబో డాగ్ సందడి అనేది మామూలుగా లేదు. ప్రతి ఒక్క ఆటగాడి వద్దకు వెళ్లి నమస్కారం అలాగే షేర్ చేయండి ఇవ్వడంతో పాటుగా కొన్ని చిలిపి చేష్టలను చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోబో డాగ్ను ఉత్సాహంగా గమనిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరమే ఈ కొత్త రోబో డాగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు బిసిసిఐ. ప్లేయర్ లందరూ సరదాగా ఈ రోబో డాగ్ తో ఆడుకుంటున్న వీడియోలను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక ఈ రోబో విషయానికి వస్తే దీని పేరు చంపక్ గా నామకరణం చేయడం జరిగింది. ఇది చాలా వేగంగా నడవగలదు అలాగే పరిగెత్తగలదు. దీంతో పాటుగా పర్యాయమాలు, జంపింగులు, కూర్చునేలా రూపకల్పన చేశారు. కొన్ని వ్యక్తిగత భావాలను సైతం వ్యక్తపరిచేలా కనిపిస్తుంది. ఇక దీని తల ముందు భాగంలో కెమెరా ఉండడంతో ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా వీడియో రూపంలో మనకు ప్రదర్శనలను చూపిస్తూ ఉంటుంది. అలాగే ఐపీఎల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా దీన్ని చూసి షాక్ అవుతున్నారు.
కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ఉత్తరాదిలో 45 డిగ్రీల ఎండ.. ఇదేం వాతావారణం
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిగ్ షాక్.. మీకు డబ్బులు రానట్టే!