
క్రైమ్ మిర్రర్ : పట్టణంలోని బ్రహ్మంగారి వీధిలో అర్ధరాత్రి హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న ఎండీ షబ్బీర్పై హైదరాబాద్కు చెందిన బీటెక్ విద్యార్థి ఎండీ షాకీర్ (23) దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో షబ్బీర్ భార్య షాహిదా బేగం కూడా షాకీర్కు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి దాడి
కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో షాకీర్ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న షబ్బీర్ ముఖంపై, నోటిలో హిట్ స్ప్రే చల్లినట్లు సమాచారం. అనంతరం బెల్టుతో అతడి మెడకు బిగించి గొంతు నులిమేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ సమయంలో షాహిదా బేగం భర్త చేతులను వెనుక నుంచి పట్టుకుని షాకీర్కు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కేకలు వేయడంతో బయటపడిన ఘటన
దాడి నుంచి తప్పించుకునేందుకు షబ్బీర్ ప్రయత్నిస్తూ గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో నిద్రిస్తున్న అతడి అన్న అక్కడికి వచ్చినట్లు సమాచారం. దీంతో షాకీర్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది.
నెల రోజుల క్రితమే వివాహం
షబ్బీర్, షాహిదా బేగంలకు నెల రోజుల క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. షాహిదా బేగం, షాకీర్ మధ్య గతంలో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిందా అనే కోణంలో వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడి తండ్రి
ఘటన అనంతరం షబ్బీర్ తండ్రి ఆలీ ఎస్పీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిసింది. మరోవైపు, వనపర్తి సర్కిల్ నైట్ డ్యూటీ ఆఫీసర్ ఎస్సై కురుమయ్య, బీట్ పోలీసులు అర్ధరాత్రి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై అనుమానాస్పదంగా వెళ్తున్న షాకీర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించినట్లు తెలిసింది. షాహిదా బేగంను సఖి కేంద్రానికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
also read : అప్పు తీర్చలేదని యువకుడి హత్య.. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు