
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఆశించిన ఫలితం దక్కకపోవడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. బీటెక్ చదివిన యువకుడు ఈ నిర్ణయం తీసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పెద్దబొడ్డేపల్లి కనకమహాలక్ష్మి వీధికి చెందిన గానుగుల సాయి మాణిక్యం (24) బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం సాధించేందుకు ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన అవకాశం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సాయి మాణిక్యం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై అతడి తల్లి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.
also read: నాని ‘బ్లడీ రోమియో’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ‘ప్యారడైజ్’కు పూర్తి భిన్నంగా!