
-
కాలేశ్వరం ప్రాజెక్టు పై గులాబీ పార్టీ ప్రచారానికి చెక్
-
ప్రపంచస్థాయి నిపుణుడు కర్నల్ పరీక్షిత్ మెహ్రతో సమాధానం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్టుపై పెద్ద రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఎండబెడుతోందని.. పునరుద్ధరణ పనులను పక్కన పెట్టిందని.. రాజకీయ కుట్రలు చేస్తోందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. నానా రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒక మిలటరీ అధికారిని రంగంలోకి దించింది. కేవలం రాజకీయ నేతల ప్రకటనలతో పొలిటికల్ రచ్చ చేయడం కంటే.. ఏకంగా ఇండియన్ ఆర్మీ కి చెందిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజింగ్ టన్నెలింగ్ అండ్ రాక్ మెకానిక్స్ ఎక్స్పర్ట్ కర్నల్ పరీక్షిత్ మెహ్రాను ముందు పెట్టి మీడియా సమావేశం నిర్వహించింది. గులాబీ పార్టీ ఎత్తుగడలను తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది.
ప్రపంచ స్థాయి నిపుణుడు…
కర్నల్ పరీక్షిత్ మెహ్ర ప్రపంచ స్థాయి సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సవాళ్లను పరిష్కరించడంలో నిపుణుడు. హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక అటల్ టన్నెల్ నిర్మాణం నుంచి.. ఉత్తరాఖండ్ లోని సంచలనం సృష్టించిన సిల్క్యారా టెన్నల్ లో చిక్కుకున్న కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ వరకు.. ఇటీవల నేపాల్ లోని వరదల్లో మునిగిపోయిన భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల రెస్క్యూ మిషన్ కు భారత స్పెషలిస్ట్ బృందం నాయకుడిగా వ్యవహరించింది కూడా ఆయనే. అటువంటి సంచలన అనుభవం ఉన్న ఆర్మీ నిపుణుడిని.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ సమన్వయకర్తగా, నిలిచిపోయిన ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్ట్ రివైవల్ హెడ్ గా బాధ్యతలు అప్పగించి.. 2027-28 వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసే లక్ష్యాన్ని ఇచ్చింది.
అంతా వ్యూహంతోనే…
ఇప్పటివరకు గులాబీ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కీలకమైన మిలటరీ అధికారి ద్వారా సమాధానాలు ఇప్పించడం ద్వారా నోరు మూయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీని వెనుక పక్కా రాజకీయం, సాంకేతిక వ్యూహం దాగి ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ప్రజలు దానిని పార్టీల మధ్య జరిగే విమర్శలు, ప్రతి విమర్శలుగా కొట్టి పారేస్తారు. కానీ దేశ రక్షణ రంగం, ఆర్మీలో పని చేసిన అత్యున్నత సాంకేతిక నిపుణుడు చార్టులు, డాక్యుమెంటరీ ఆధారాలతో సహా ప్రెస్ మీట్ లో మేడిగడ్డ కుంగిపోవడానికి దారి తీసిన తీవ్రమైన డిజైన్ లోపాలను, ప్రాజెక్టు భద్రతా ప్రమాదాలను వివరిస్తుంటే.. గత ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. తద్వారా గులాబీ పార్టీ ప్రచారానికి చెక్ పెట్టినట్లు అయింది. పొలిటికల్ గ్రామాలకు తావు లేకుండా నిపుణుల సమక్షంలో నిజాలను బయటపెట్టడం ద్వారా గులాబీ పార్టీని ఆత్మరక్షణలో పెట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది.
ఇవి కూడ చదవండి:
- న్యూజిలాండ్తో మూడో T20కీ స్టార్ బ్యాటర్ దూరం!
-
మరోసారి బాలయ్యతో సంయుక్తా మీనన్ జోడీ
-
ముంబై ఇండియన్స్ నాయకత్వంపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
జడ్జి కుమారుడి కారు బీభత్సం.. 55 ఏళ్ల వ్యక్తి దుర్మరణం