
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ :- చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 14వ వార్డులో ఇటీవల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ సోదరుడు పబ్బు శివ గౌడ్, ఇటీవల మరణించారు. ఈ సందర్భంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల విప్లవ కుమార్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి దుఃఖసమయంలో తోడుగా నిలుస్తూ, కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల విప్లవ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read also: 100 కోట్ల చేరువలో యంగ్ హీరో సినిమా.. ఇది కదా మిరాకిల్ అంటే?
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్ సందగల్ల విజయసతీష్ గౌడ్, తూర్పునూరి రవి గౌడ్, చెరుకు రాజు గౌడ్, ఉడుగు నరసింహ గౌడ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు, వారి ఇబ్బందుల సమయంలో అండగా నిలవడం ద్వారా నిజమైన ప్రజా నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
Read also : గద్వాల జిల్లాలో దారుణం.. నిద్రలో ఉన్న భర్తపై భార్య దాడి