తెలంగాణ

మిర్యాలగూడ ఎమ్మెల్యే డ్యామేజ్ కంట్రోల్.. రైతుల కోసం సీఎం రేవంత్ కు 2 కోట్ల చెక్

రైతులు యూరియా బస్తాల కోసం పడరాని పాట్లు పడుతున్న వేళ.. ఎమ్మెల్యే గన్ నెన్ యూరియా బస్తాల లారీని పక్కదారి పట్టించడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరువు పోయింది. యూరియా అమ్ముకున్నాడని రైతులు తిట్టిపోయడంతో ఆయనకు నియోజకవర్గంలోని తిరగలేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరో ప్లాన్ చేశారు.
డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలటూ.. ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు మిర్యాలగూడ ఎంఎల్ ఏ బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు. 2 కోట్లను తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితం గా అందజేయాలని కోరారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఇటీవల ఎంఎల్ ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు MLA లక్ష్మారెడ్డి.కానీ ఇప్పుడు రిసెప్షన్ ను రద్దు చేసుకొని ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకు వచ్చారు ఎమ్మెల్యే. రైతుల కోసం 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన లక్ష్మారెడ్డి ,కుటుంబ సభ్యులను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇటీవల లారీ లోడ్ యూరియాను బ్లాక్‌లో అమ్ముతూ పట్టుబడ్డాడు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగు నాయక్. రైతులకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్‌లో అమ్మి అడ్డంగా దొరికాడు. లారీ యూరియా లోడ్‌ను బ్లాక్‌లో అమ్మేశాడు మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏ అంటూ, లారీ లోడ్‌ యూరియాను బ్లాక్‌లో అమ్మేశాడు గన్‌మెన్ నాగు నాయక్. తమకు యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకొని గన్‌మెన్‌పై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button