
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక హాట్ హాట్ గా మారింది. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. మరో వారంలో బైపోల్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాని ఇప్పటికే నియోజకవర్గంలో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. అన్ని పార్టీలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యనేతలంతా ఇక్కడే మకాం వేశారు. జూబ్లీహిల్స్ లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది.
తాజా మాజీ ఎమ్మెల్సీ, మైనార్టీ నాయకుడు అమీర్ అలీఖాన్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సమావేశమయ్యారు. కవిత నివాసంలో వీరిద్దరి మధ్య దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. తెలంగాణ జాగృతి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమీర్ అలీఖాన్ ను బరిలో నిలపాలని కవిత ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అమీర్ అలీఖాన్ ఓకే చెబితే అతన్ని బరిలోకి దింపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు అమీర్ అలీఖాన్. తనను ఎమ్మెల్సీగా తొలగించి… అజారుద్దీన్ కు ఇవ్వడంపై ఆయన మండిపడుతున్నారు. తనను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందనే ఆగ్రహంతో ఉన్నారు అమీర్ అలీఖాన్.