Crime Mirror
Breaking News
Follow Us
Date of Publish: January 25, 2025
Digital Edition: Crime Mirror

రైతు భరోసా, రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక సమావేశం

తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు కీలక పథకాలను అమలు చేయబోతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్దిదారులకు డబ్బులు పంపిణి చేయనుంది. అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పట్టాలెక్కించనుంది.ఈ నాలుగు పథకాల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించింది ప్రభుత్వం.

నాలుగు పథకాల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ నెల 26వతేదీ నుండి అమలు చేయబోతున్న ఫధకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పధకాలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారీ, పైనాన్స్,అగ్రి కల్చర్,రెవెన్యూ, హౌసింగ్ లకు సంబంధించిన శాఖల‌ ఉన్నతాధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొననున్నారు.

Home