
ఢిల్లీలో నిరసన తెలిపేందుకు సిద్ధమైన సిజెపి మద్దతుదారుల ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు, ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చిన వారిని అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిరసన వేదికకు వచ్చే ప్రముఖులను ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు ఐజీఐ ఎయిర్పోర్ట్ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.మరోవైపు సరిహద్దుల్లోనూ నిఘా పెంచారు. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులు బార్డర్లోనే కఠినంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల చర్యలతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.