
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మంత్రులకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు… ఈసారి కేబినెట్ మీటింగ్‌కు చేతులు ఊపుకుంటూ రాకుండా.. వాని వారి శాఖలకు సంబంధించిన నివేదికలతో రావాలని ఆదేశించారు. అలాగే సమస్యలపై ప్రజెంటేషన్లు కూడా ఇవ్వాలన్నారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే… ఊస్టింగే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఏపీ సీఎం.
Read also : రాజకీయాలు వదలడం ఇష్టంలేదు.. ఉపరాష్ట్రపతిని చేసిన రోజు ఏడ్చేశా..!
ఏపీ కేబినెట్‌లో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి స్కీమ్‌కు ఆమోదం తెలిపారు. ఈనెల 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు కానుంది. ఫ్రీ బస్సు పెడితే.. ఆటో నడిపేవారికి ఇబ్బందులు వస్తాయని ముందే ఊహించిన సీఎం చంద్రబాబు… ఫ్రీ స్కీమ్ అమలు చేసేముందే వారితో మాట్లాడబోతున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుని.. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక.. కొత్త బార్ పాలసీని ఆమోదించారు. కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లోకి బినామీలు వస్తే… ఊరుకోబోమని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Read also : ఆలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుమతించొద్దు!.. దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు
మంత్రివర్గం సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత.. మంత్రుల పనితీరుపై ప్రశ్నించారు సీఎం. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలి… ఉదాసీనంగా ఉంటే.. ఉపేక్షించేది లేదని చాలా సీరియస్‌గా చెప్పారు. వచ్చే కేబినెట్ సమావేశానికి మంత్రులు వారివారి శాఖలకు సంబంధించిన నివేదికలు, ప్రజెంటేషన్లతో రాకపోతే… ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని… ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఈనెల 15న.. ఆర్టీసీలో మహిళలకు ఉచిత స్కీమ్ ప్రారంభోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలన్నారు. బహానాలు చెప్తే కుదరదని గట్టిగానే చెప్పారు.
ఇక… కొత్త జిల్లాల పేర్లు మార్పు అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించారు. వైసీపీ హయాంలో ఇష్టమొచ్చిన జిల్లాలను విడగొట్టారని… అప్పటి నుంచి చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఆ సమస్యలను గుర్తించి.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. కొత్త జిల్లాల పేర్లు, అడ్డదిడ్డ విభజన వల్ల ఎదురైన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధి వెంటనే మంత్రివర్గ ఉపసంఘం వేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ మధ్య సింగపూర్ పర్యటన వివరాలను కూడా మంత్రులకు వివరంగా చెప్పారు సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పరిణామాల కారణంగా సింగపూర్ కంపెనీలు ఏపీకి వచ్చేందుకు ఇష్టపడటంలేదని అన్నారు. సీడ్ క్యాపిటల్‌లో భాగస్వామ్యం కూడా వద్దని వారు స్పష్టంగా చెప్పారన్నారు. అయితే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వచ్చేందుకు సింగపూర్ ప్రతినిధులు అంగీకరించారని… వారితో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు.
Read alao : రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!