జాతీయం

భార్యను వదిలేసి వెళ్లిన కేంద్రమంత్రి, మరీ అలా మర్చిపోతే ఎలా సర్?

Shivraj Singh Chouhan Forgets His Wife: మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఏకంగా తన భార్యను మర్చిపోయి వెళ్లిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. తాజాగా గుజరాత్ పర్యటనకు వెళ్లిన ఆయన.. తన భార్యను జునాగఢ్‌ లో మర్చిపోయి రాజ్‌ కోట్‌ కు బయల్దేరారు. విమానాన్ని అందుకోవాలన్న ఆత్రుతలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?

గుజరాత్‌ పర్యటనకు వచ్చిన మంత్రి శివరాజ్ చౌహాన్ తన భార్య సాధనాసింగ్‌ తో కలిసి సోమనాథ్‌ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఆమె ఇతర ఆలయాలను దర్శించుకుంటానని చెప్పడంతో అక్కడే దింపారు. ఆ తర్వాత శివరాజ్ గిర్‌ లోని సింహాల అభయారణ్యాన్ని సందర్శించారు. అక్కడి నుంచి జునాగఢ్‌ లోని గ్రౌండ్‌ నట్‌ రిసెర్చ్‌ సెంటర్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ అనుకున్న సమయం కంటే ఆలస్యం అయ్యింది. విమానానికి ఆలస్యం అవుతుండటంతో ఆయన తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌ కోట్‌ కు బయల్దేరారు.

భార్యను వదిలి బయల్దేరిన శివరాజ్!

అటు గిర్నర్‌ దేవాలయ దర్శనం చేసుకుని ఆయన భార్య సాధన జునాగఢ్ కు వచ్చింది.  గ్రౌండ్‌ నట్‌ రిసెర్చ్‌ సెంటర్‌ వెయిటింగ్‌ రూమ్‌లో వేచి చూస్తున్నది. అయితే ఈ విషయం మరిచిపోయి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి ఆమె షాకయ్యారు. కొంత దూరం వెళ్లాక మంత్రికి భార్య సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే కాన్వాయ్‌ను తిరిగి వెనక్కి తిప్పించారు. సాధనాసింగ్‌ ను ఎక్కించుకుని తిరిగి రాజ్‌ కోట్‌ కు వెళ్లిపోయారు. ఈ ఘటన అందరిలో నవ్వుల పువ్వులు పూయించింది.

Read Also: రాష్ట్రపతి ముర్ము సందేహాలు, 22న సుప్రీంలో కీలక విచారణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button