క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గుండెపోటు సమస్యలు ఎక్కువుతోన్న ప్రస్తుత రోజుల్లో సీపీఆర్ గురించి ప్రతీఒక్కరికీ అవగాహన పెరుగుతోంది. ప్రాణం పోయే వ్యక్తిని కాపాడే శక్తి ఈ సీపీఆర్‌కు ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ సీపీఆర్ నిర్వహించి చావు అంచులకు చేరుకున్న వ్యక్తిని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి ఎస్సై సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ అనూహ్య ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సంతోష్ ముఖర్జీ (38) బతుకుదెరువు దృష్ట్యా హైదరాబాద్‌కు వచ్చాడు.
Read Also : గైడ్‌గా ‘మై మేడారం యాప్’… యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క, కలెక్టర్
ఈ క్రమంలోనే కుటుంబ సమస్యల కారణంగా వేదనకు గురైన ముఖర్జీ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై మైబెల్లి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ముఖర్జీని వెంటనే కిందికి దించారు. అప్పటికే అతని శ్వాస ఆగిపోవడంతో సీపీఆర్ చేశారు. కొద్దిసేపటికి బాధితుడు స్పృహలోకి రావడంతో అతను ప్రాణాలతో బయటపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన సేవ అందించడంతో ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ ద్వారా ప్రాణాలు పోసిన ఎస్సైపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్లో మరో వికెట్ డౌన్.. ఈసారి ఎమ్మెల్యే.. ఎలక్షన్ రిజల్ట్ రోజు నుంచే లీకులు..!!!
- ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. రంగంలోకి తెలంగాణ సీఎం???
- పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించనున్న తెలంగాణ బీజేపీ.. నేటి నుండి విజయ సంకల్ప యాత్రలు
- సొంతిళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్.. నియోజకవర్గానికి 3,500ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు