అంతర్జాతీయం

ఆపరేషన్ సిందూర్‌.. 13 మంది పాక్‌ సైనికులు హతం!

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ లో 13 మంది సైనిక అధికారులు సహా మొత్తం 50కిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు పాకిస్థాన్‌ ఎట్టకేలకు అంగీకరించింది. పాక్‌ అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా తమకు భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు మూడు నెలల తర్వాత  పాకిస్థాన్‌ అంగీకరించినట్లు వెల్లడించింది. భోలారీ వైమానిక స్థావరంపై భారత్ చేసిన దాడిలో స్క్వాడ్రన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసఫ్‌ మరణించినట్లు ధృవీకరించింది. అతడికి మరణానంతరం ప్రెసిడెన్సీ అవార్డును ప్రదానం చేయడం ద్వారా పాకిస్థాన్‌ తాజాగా నిర్ధారించింది.

పలువురు జవాన్లకు తంఘా ఐ బసలత్‌ అవార్డులు

ఆపరేషన్‌ సిందూర్‌ లో చనిపోయిన మిలిటరీ అధికారులకు ఆగస్టు 14న పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా   పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్ష భవనంలో అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో హవల్దార్‌ ముహమ్మద్‌ నవీద్‌, నాయక్‌ వకార్‌ ఖాలిద్‌, లాన్స్‌ నాయక్‌ దిలావర్‌ ఖాన్‌ సహా పలువురికి మరణానంతరం ఇచ్చే తంఘా ఐ బసలత్‌ అవార్డులు ఇచ్చారు. నాయక్‌ అబ్దుల్‌ రెహ్మన్‌, లాన్స్‌ నాయక్‌ ఇక్రముల్లా, సిపాయి అదీల్‌ అక్బర్‌ సహా పలువురికి తంఘా ఐ జురత్‌ అవార్డులను అందజేశారు.

Read Also: భారత్ కు చైనా విదేశాంగ మంత్రి.. పర్యటన వెనుక కారణం ఇదే!

Back to top button