
గండిపేట్, క్రైమ్ మిర్రర్:- దక్కన్ శబరి పీఠంగా భక్తులచే ప్రసిద్ధిగాంచిన కాటేదాన్ మణికంఠ హిల్స్ లోని శ్రీ అయ్యప్ప దేవాలయం నుంచి కేరళలోని శబరిమలకు సువర్ణభూమి మహా పాదయాత్ర ఈ నెల 8వ తేదీన ప్రారంభం అవుతుందని ఆలయ ఫౌండర్ సభ్యలు వేముల వెంకటేష్ (గురుస్వామి) తెలిపారు. తాను 18వ సంవత్సరం అయ్యప్ప మాలాధారణ చేసిన శుభ సందర్భంగా నారికేళ గురుస్వామిగా ఈ నెల 11వ తేదీన మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Read also : వీధి కుక్కల సమస్యలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!
ఆదివారం కాటేదాన్ శ్రీ అయ్యప్ప ఆలయం నుంచి సువర్ణభూమి మహా పాదయత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మాలాధారణ చేసిన స్వాములు ప్రత్యేక పూజల అనంతరం నడక యాత్ర ప్రారంభిస్తారని,11వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని కందూర్ లో గల సుప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగాణంలో 18వ మహాపడి పూజ ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాలలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ టి. ప్రేమ్ దాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సానెం శ్రీనివాస్ గౌడ్, దక్కన్ శబరి పీఠం అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు సంరెడ్డి ప్రమోద్ రెడ్డి, ప్రతినిధులు రాము గౌడ్, అర్థం శ్రీనివాస్ గుప్త, సంకూరి జయప్రకాష్ నేత, పులిజాల వివేకానంద నేత, సంతోష్ గుప్త, నర్సిరెడ్డి, సారంగ రవికుమార్ తో పాటు సానెం నర్సింగ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, టి.ప్రేమ్ గౌడ్, అశోక్ సాగర్, బాస శ్రీనివాస్ నేత, గట్టయ్య, పాము శేఖర్, సంకూరి శ్రీకాంత్ నేత తదితరులు పాల్గొంటారని వేముల వెంకటేష్ నారికేళ గురుస్వామి పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో మహా పాదయాత్ర ప్రారంభ పూజ తోపాటు 18వ మహా పడిపూజ కార్యక్రమాలకు హాజరై ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.
Read also : కారణాలు చెప్పకుండా అరెస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : సుప్రీంకోర్టు





