
క్రైమ్ మిర్రర్, వలిగొండ : వలిగొండ మండల కేంద్రంలో గత వారం రోజుల నుండి మధుర ఫలం మామిడి పండ్ల అమ్మకం జోరు అందుకుంది. మండలంలోని వివిధ గ్రామాల నుండి మామిడిపండ్ల అమ్మకం దారులు పెద్ద ఎత్తున వలిగొండ మండల కేంద్రానికి తీసుకువచ్చి కుప్పలుగా పోసి అమ్ముతున్నారు.
మామిడి పండ్లు పసుపు పచ్చ రంగులో ఆకర్షణీయంగా తీయని వాసనతో కొనుగోలుదారులను కట్టిపడేస్తుండడంతో మామిడి పండ్లను ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం వరకు మామిడి పండ్లు అంతగా అమ్మకానికి రాకపోవడంతో నిట్టూర్చిన జనం గత వారం రోజుల నుండి కుప్పలు తెప్పలుగా వస్తున్న మామిడి పండ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.