ఆంధ్ర ప్రదేశ్

బ్రేకింగ్ న్యూస్.. DSC అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా.. నిరాశలో అభ్యర్థులు!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో DSC అభ్యర్థులకు రేపు అమరావతిలో అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా రేపు అమరావతి వెళ్లడానికి.. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు చెప్పడంతో.. అభ్యర్థులందరూ కూడా మళ్లీ తిరిగి ఇంటికి ప్రయాణాలు చేస్తున్నారు. రేపు అమరావతి వచ్చేందుకు అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను కూడా అధికారులు తాజాగా క్యాన్సిల్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎందుకు వాయిదా పడింది అనే వివరాలను మాత్రం విద్యాశాఖ అధికారులు ప్రకటించలేదు. ఎంతో ఆశతో DSC అభ్యర్థులు రేపు అమరావతిలో అపాయింట్మెంట్ లెటర్లను తీసుకోవడానికి చాలా సంతోషంతో అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది. అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ పై త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని.. ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు సమాచారం అందజేసింది. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో వర్షాలు పడుతున్నందువలన ఈ ప్రోగ్రాం వాయిదా పడినట్లు అనధికారికంగా సమాచారం అందుతుంది. ఏది ఏమైనా కూడా ఎన్నో.. అడ్డంకుల తర్వాత డిఎస్సీ పరీక్ష జరగడం.. ఆ తరువాత కొంతమంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం చకా చకా అయిపోయాయి. ఇవాళ ఈ కార్యక్రమం వాయిదా పడడంతో.. డీఎస్సీ అభ్యర్థులలో నిరాశ వ్యక్తం అవుతుంది.

Read also : జూబ్లీహిల్స్ లో రేవంత్ కు బిగ్ షాక్.. కవితతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ భేటీ!

Read also : ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం : మంత్రి నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button