
ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: తన కంపెనీలో పని చేసే ఉద్యోగులు చలిలో వణుకుతు చలిలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై విదులకు రావడాన్ని గమనించిన యజమాని మనస్సు చలించిపో బీఎండబ్ల్యు కార్లనే గిఫ్ట్‌గా ఇచ్చి శభాస్ అనిపించుకున్నారు. ఉద్యోగులు బాగుంటేనే కంపెనీ బాగుంటుందని నమ్మిన కంపెని యజమాని ఉద్యోగులకు సరప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. తన కోసం కష్టపడే ఉద్యోగులు మాత్రం వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కోవడం ఎందుకని ఆలోచించారు. అంతే.. వారి కష్టాన్ని తగ్గించేందుకు ఏకంగా బీఎండబ్ల్యూ కార్లనే కానుకగా ఇచ్చారు. ఒక్కో కారు విలువ సుమారు రూ.43 లక్షలు ఉండటం గమనార్హం. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.
మీటింగ్ ఉందని సర్ప్రైజ్…
హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువో నగరంలో మా యాన్లీ అనే మహిళ బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్‌ను నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కొందరు ఉద్యోగులకు బహుమతిగా కార్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 24న వారిని బీఎండబ్ల్యూ షోరూమ్‌కు తీసుకెళ్లారు. మీటింగ్ ఉందని చెప్పడంతో ఉద్యోగులు సాధారణంగానే వెళ్లారు. తీరా అక్కడికి చేరుకున్నాక తమకు కొత్త కార్లు కానుకగా ఇవ్వబోతున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక్కో కారు విలువ సుమారు 3 లక్షల యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.43 లక్షలు). ఈ కార్లను మా యాన్లీ రెండు వారాల ముందే పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
ఉద్యోగిని చూసి చలించిపోయి…
ఇలా బెస్ట్ ఎంప్లాయీస్‌కు బీఎండబ్ల్యూ కార్లను కానుకగా ఇచ్చిన ఈ ఆలోచన వెనుక ఓ సంఘటన ఉందని మా యాన్లీ తెలిపారు. గత శీతాకాలంలో ఓ ఉద్యోగిని ఉదయాన్నే చలిలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రెస్టారెంట్‌కు వచ్చింది. చలికి ఆమె ముఖం ఎర్రగా మారడం చూసి మా యాన్లీ చలించిపోయారు. తాను కారులో వెచ్చగా, సౌకర్యంగా ప్రయాణిస్తుంటే.. తన కోసం పనిచేసే ఉద్యోగులు మాత్రం చలిగాలులకు ఇబ్బంది పడటం ఆమెను ఆలోచింపజేసింది. ‘నేను కారులో సౌకర్యంగా ప్రయాణించగలుగుతున్నప్పుడు.. నా ఉద్యోగులు ఎందుకు అలా కష్టపడాలి?’ అని తనలో తాను ప్రశ్నించుకున్నట్లు ఆమె వివరించారు.తన వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉద్యోగుల సమష్టి కృషే ప్రధాన కారణమని మా యాన్లీ పేర్కొన్నారు. తాను సాధించిన విజయాల ఫలాలు ఉద్యోగులకూ అందాలని, వారి జీవితాల్లోనూ సౌకర్యాలు పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, కారు అందుకున్న లీ జీ అనే ఉద్యోగిని ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకు ఇంత పెద్ద బహుమతి వస్తుందని కలలోనూ అనుకోలేదు. షోరూమ్‌కు వెళ్తున్నప్పుడు బాస్ ఓ పెద్ద బొమ్మను గిఫ్ట్‌గా ఇస్తానని మాత్రమే చెప్పారు’ అని ఆమె చెప్పినట్లు పేర్కొంది.
ఇవి కూడ చదవండి:
- హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సీఎం కొడుకు..?
-
రాహుల్ గాంధీలో ఓ విచిత్రమైన దోరణి కనిపిస్తోంది….! కిషన్‌రెడ్డి…
-
ఈ నెల 10న ఢిల్లీలో ఆందోళనకు సీజేపీ పిలుపు…! కేంద్రం అప్రమత్తం…
-
అదుపు తప్పి కారు బోల్తా…! ఒకరు మృతి…ఇద్దరి పరిస్థితి విషమం…