
తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై విపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ మేథావులు, పౌర సమాజం మండిపడుతోంది.నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్ రేవంత్ రెడ్డి అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. లేదు సిగ్గులేకుండా అట్లనే కొనసాగుతా అంటే ప్రజలే బుద్ధి చెప్తారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు.
తెలంగాణ ఎన్నడూ కూడా పేద రాష్ట్రం కాదని ఎంపీ ఈటల రాజేందర్. దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ అన్నారు. సన్న బియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ.. కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయన్నారు. అలాంటి తెలంగాణను రేవంత్ రెడ్డి దివాలా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నాడని ఈటల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పరిపాలించే చేత కాక, అనుభవం లేక, ఏమి మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడని విమర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్.