మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ఈ రైలు ప్రమాదం జరిగినట్లుగా మీడియా కథనాలు వెల్లడించాయి. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో ట్రైన్ లో ఉన్నటువంటి కొందరు ప్రయాణికులు చైన్ లాగే కిందకు దిగారు. అయితే పక్క ట్రాక్ పై వెళ్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఇక దీంతో ఏకంగా ఎనిమిది మంది ప్రయాణికులు మరణించడంతోపాటు 40 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ రైలు ప్రమాదంలో మరింత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి ఈ రైలు ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులను కర్ణాటక ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో చిందరవందరగా ప్రయాణికులు పడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు అవుతున్నాయి. ఈ ఘటనపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వాధికారులు సరైన సమాచారం అనేది మీడియా ముందుకు వచ్చి తెలియజేయలేదు.
ఇవి కూడా చదవండి
1.విమాన ప్రయాణికురాలి లోదుస్తుల్లో మూడు లైటర్లు