నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే గౌరవానికి ప్రతీక.. రాత్రిపగలనే తేడా లేకుండా, ప్రజల రక్షణకై అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా చేస్తున్నారు కొంతమంది పోలీస్ సిబ్బంది.. ఈ మధ్య కాలంలో నల్లగొండ పోలీసుల వ్యవహారం, సభ్యసమాజం తలదించుకునే విధంగా తయారైంది. అక్రమ వసూళ్లే కాకుండా, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, సంసారం, పెండ్లీలనే సాంప్రదాయాలను స్వయంగా పోలీసులే బొంద పెడుతున్నారు.. తోటి కింది స్థాయి సిబ్బందిని, పిర్యాదు దారులను స్వయంగా పోలీసులే లోబరుచుకోవడంపై, మొత్తం డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుందనే చెప్పుకోవాలి.
తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. రేపు రాత్రి ఉచిత రవాణా సదుపాయం
నల్లగొండ టూ టౌన్ సిఐ డానీయల్ కధ మరువకముందే, మరో కొత్త కధ తెరమీదికి రావడం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దుమారం లేస్తుంది.. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గా విధులు నిర్వహించే మహేందర్, హాల్య పరిధిలోని ఎక్సైజ్ కానిస్టేబుల్ తో, గత కొంత కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని మమల్ని పట్టించుకోవటం లేదంటూ, మహేందర్ భార్య ఆరోపిస్తున్నారు..!? ఈ నేపథ్యంలో తన భర్తతో కలిసి ఉంటున్న ఆ కానిస్టేబుల్ తో, మహేందర్ భార్య మాట్లాడిన సంభాషణ ఆడియో సోషల్ మీడియా నందు చక్కర్లు కొడుతుంది. వ్యవస్థను ఒక గాడిన నడిపించాల్సిన పోలీసులే ఇలా పది మంది నవ్వేలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..!? గత కొన్ని రోజుల క్రితమే సిఐ డానీయల్ పై, ఐజి సత్యనారాయణ, ఎస్పి శరత్ చంద్ర పవార్ లు ఇలాంటి అంశంపై చర్యలు తీసుకున్న విషయం అందరికి తెలిసినదే.. ఆ సంఘటన మరువకముందే మహేందర్ బాగోతం బట్టబయలు కావడంతో డిపార్ట్మెంట్ లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది.
శుభవార్త అందించిన టీటీడీ బోర్డు.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతి
ఇలాంటి సంఘటనల కారణంగా ఎంతో ప్రతిష్ట కలిగిన పోలీస్ వ్యవస్థకు భంగం కలుగుతుందని ప్రచారం. మల్టీజోన్ 2 ఐజి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు కలిసి నల్లగొండను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని, నేరాలను తగ్గించాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తుంటే, ఇలాంటి కొంతమంది అధికారుల కారణంగా వారు చేసే కృషికి ఫలితం లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇతగాడిపై ఇంతకు ముందు అక్రమ వసూళ్లు చేస్తున్నాడని అనేక ఆరోపణలు వచ్చాయి..!? పిడిఎస్, ఇల్లీగల్ దందాలలో వాటాలు మూటలు కట్టుకున్నాడని, తెర వెనుక మరో అధికారి హస్తం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతున్న ఈ క్రమంలో, అక్రమ సంబంధం దుమారం లేపుతుంది. జిల్లా ఎస్పీ మహేందర్ పై విచారణ జరిపి, శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.. మల్టిజోన్ ఐజి సత్యనారాయణ ఐపిఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ లు ఈ అంశంపై ఏ విధమైన చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన
జిల్లా పోలీస్ అధికారుల చిట్టా క్రైమ్ మిర్రర్ చేతిలో… మరెన్నో సంచలనాత్మకమైన కధనాలతో మీ ముందుకు. దేవరకొండ సబ్ డివిజన్ లోని మరో కాముడి కధాగానంతో పాటు సూర్యపేట, నల్లగొండ జిల్లాల అడిషనల్ ఎస్పీ ల కధాగానం త్వరలో క్రైమ్ మిర్రర్ సంచికలో…నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.