క్రైమ్

కలెక్టర్ పై దాడి.. 16 మంది రైతులకు రిమాండ్

పక్క నుంచి 20 నుంచి 30 మంది వరకు ఒక్కారిగా ముందుకు వచ్చారు. దాడికి దిగుతున్నారని గుర్తించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్.. కలెక్టర్​ను కారు దగ్గరకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఇతర అధికారులపై దాడి చేయబోతున్నారని గమనించిన కలెక్టర్..​ వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు.అప్పటికే రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే కలెక్టర్​ను ఆయన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్​ కారు ఎక్కించి ముందుకు తీసుకువెళ్లబోయారు.

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో వికారాబాద్ ఎస్పీపై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన 16 మంది రైతులను కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. 16 మంది రైతులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి కేసులో మొత్తం 52 మంది రైతులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపారు. విచారణ తర్వాత 36 మందిని పోలీసులు విడిచిపెట్టారు. మిగిలిన 16 మంది రైతులను కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.

దుద్యాల, లగచర్ల, పోలేపల్లిలోని 1,350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్​ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా దుద్యాలలో గ్రామసభ, ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం కలెక్టర్​ ప్రతీక్ ​జైన్, అడిషనల్ ​కలెక్టర్​ లింగ్యా నాయక్, సబ్​ కలెక్టర్​ ఉమాశంకర్ ప్రసాద్, కడా స్పెషల్​ఆఫీసర్​ వెంకట్​రెడ్డితో పాటు ఇతర అధికారులు వచ్చారు. అయితే గ్రామసభకు ఒక్క రైతు కూడా హాజరు కాలేదు. అయితే సురేష్ అనే వ్యక్తి వచ్చి కలెక్టర్ తో మాట్లాడారు. రైతులంతా లగచర్లలో ఉన్నారని.. అక్కడికి వస్తే వాళ్లతో మాట్లాడవచ్చని చెప్పారు. దీంతో కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల వెళ్లారు.

కారు దిగి రైతులతో కలెక్టర్ మాట్లాడుతుండగానే పక్క నుంచి 20 నుంచి 30 మంది వరకు ఒక్కారిగా ముందుకు వచ్చారు. దాడికి దిగుతున్నారని గుర్తించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్.. కలెక్టర్​ను కారు దగ్గరకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఇతర అధికారులపై దాడి చేయబోతున్నారని గమనించిన కలెక్టర్..​ వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే కలెక్టర్​ను ఆయన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్​ కారు ఎక్కించి ముందుకు తీసుకువెళ్లబోయారు. ఈ దశలో ఆయన వాహనంపై దాడి చేశారు. వెనుక అద్దాలపై రాళ్లు వేయడంతో, అవి పగిలిపోయాయి. అడిషనల్ ​కలెక్టర్ ​లింగ్యా నాయక్, స్పెషల్​ఆఫీసర్​ వెంకట్​రెడ్డి దొరకడంతో వారిని ఇష్టమున్నట్టు కొట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వారు గాయపడ్డారు. దాడి చేస్తున్న వారి నుంచి తప్పించుకోవడానికి సమీపంలోని వరి చేన్లలోకి పరుగులు తీశారు. అయినా వదలకుండా వెంటపడ్డారు. అప్పుడే దుద్యాల నుంచి మిగతా పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడగలిగారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

కొడంగల్ దాడుల వెనుక కేటీఆర్ హస్తం!

Spread the love
Back to top button