
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్:- గద్వాల జిల్లా, మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో కుటుంబ కలహం విషాదాంతానికి దారితీసింది. భార్యపై దాడి చేసిన భర్తను, ఉదయం ప్రతీకారంగా భార్య మంటల్లో ఆవహింపజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి భర్త మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో భర్త తనపై చేసిన దాడిని మనసులో పెట్టుకున్న భార్య, ఉదయం భర్త లేవకముందే ఇంట్లో ఉన్న 5 లీటర్ల వంట నూనెను వేడి చేసి, భర్త ముఖం మరియు శరీరంపై పోసింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
Read also: 100 కోట్ల చేరువలో యంగ్ హీరో సినిమా.. ఇది కదా మిరాకిల్ అంటే?
అపస్మారక స్థితిలో ఉన్న భర్తను కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రమై ఉండడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఈ ఘటనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుటుంబ కలహాలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి బయటపడింది.
Read also : షేక్ హ్యాండ్ ఇవ్వాలనే చట్టం ఏం లేదు : బీసీసీఐ అధికారి