
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ లాడ్జిలో భర్త తన భార్యపై బీర్ బాటిల్తో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీద్ బాషా అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం భార్యపై బీర్ బాటిల్తో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముళబాగల్ ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.
నిందితుడు పోలీసుల అదుపులోకి..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి, కేసు నమోదు చేశారు. నిందితుడు నవీద్ బాషాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read: ప్రియుడికి బెయిల్ కోసం డ్రగ్స్ దందా.. ప్రియురాలు అరెస్ట్!