
ఆళ్లగడ్డ పట్టణంలో విషాదకర ఘటన వెలుగుచూసింది. ప్రజ్ఞా కాలేజీ సమీపంలోని చెత్తబుట్టలో ఓ శిశువు మృతదేహం కనిపించింది. చెత్తను సేకరించే సమయంలో వీధి కుక్కలు మృతదేహాన్ని బయటకు లాగేందుకు, తినేందుకు ప్రయత్నించడాన్ని పారిశుద్ధ్య కార్మికులు గమనించారు. వెంటనే కుక్కలను అక్కడి నుంచి తరిమివేసి, చెత్తబుట్టలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించే అవకాశం ఉంది. శిశువు మృతదేహాన్ని అక్కడ ఎవరు పడేశారు? ఈ ఘటనకు కారణమేంటి? అనే విషయాలు ప్రస్తుతం తెలియాల్సి ఉంది.
శిశువు మృతదేహాన్ని చెత్తబుట్టలో పడేసిన వారి వివరాలు తదితర అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
also read: బేగంపేటలో దారుణం.. 8 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులు