![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-36.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల విషయంలో కొంత ఆలస్యం అవుతుంది. అయితే తాజాగా ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల పై మంత్రి పయ్యావులతో పాటుగా కొంతమంది అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని అన్నారు. కాబట్టి వీటిపై బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రులకు అలాగే పలువురు అధికారులకు తెలియజేశారు. వీటితోపాటుగా కొన్ని సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల సమతూకం పైన చర్చిస్తున్నామని అన్నారు.
కాగా ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చడంలో ముందడుగు వేయట్లేదని, ప్రజలను నిండా ముంచేయడానికి చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు అంటూ ఉన్నారు. ఈ విషయంపై తాజాగా చంద్రబాబు నాయుడు ఇక హామీల విషయంలో లేట్ చేస్తే మరింత పార్టీపై దెబ్బ పడుతుందనే ఆలోచనతో తొందరగా హామీలను నెరవేర్చే దిశగా వెళ్తున్నారు. త్వరలోనే అన్ని హామీలు కూడా నెరవేర్చేలా పన్నాగాలు చేస్తున్నారు. మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడూ నెరవేరుతాయా అని ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!.. ఈసారైనా జరిగేనా?