
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో CRDA చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 10 సంస్థలతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన SIPB ఆమోదం తెలిపింది.
ఆ పది సంస్థలు రాష్ట్రంలో పెట్టనున్న 1లక్ష 21వేల 659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖలో 1వేయి 500 కోట్ల పెట్టుబడులతో నిర్మించే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్‌లో అమలు చేయాల్సిన పథకాలపై చర్చించనుట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణ పనులు కుంటుపడ్డాయి. కొద్దినెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి అంశం తెరపైకి వచ్చింది. రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధానితో ఆయన భేటీ కానున్నారు. అమరావతి పనుల పునర్ ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. అమరావతికి ప్రపంచబ్యాంక్
నిధులతో పాటు.. పలు అంశాలపై ప్రధానితో చర్చిస్తారు.
ఇవి కూడా చదవండి …
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గరు మృతి!
-
మూడు రోజుల్లోనే 24 కోట్లు సంపాదించిన “కోర్ట్ ”
-
కెసిఆర్ జాతిపిత… రేవంత్ రెడ్డి బూతు పిత: హరీష్ రావు ..
-
ఈనెల 21 నుంచి వర్షాలు.. వాతావరణ శాఖ గుడ్ న్యూస్
-
సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమ జర్నలిస్టుల వార్నింగ్
-
తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ రచ్చే.. మూడు కీలక బిల్లులు