క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పటాన్ చెరులోని ముత్తంగి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65పై ఈ ప్రమాదం జరిగింది.
ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయే క్రమంలో, బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడంతో (బ్రేక్ ఫెయిల్) బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఢీకొట్టింది.
అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు.
Also Read:మరి ఇంత సన్నగా అయిపోయాడు ఏంటి.. యంగ్ టైగర్ కు ఏమయింది?
Also Read:మణికొండలో కాల్పుల కలకలం..!





