
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. కానీ దాదాపు కొన్ని ఏళ్ల నుంచే సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. మహేష్ బాబు సినిమాలలో నటించిగా వచ్చిన డబ్బు లో సగం తన ఫౌండేషన్ కి ఉపయోగించడం నిజంగా మెచ్చుకోవలసిన విషయమే. చిన్నపిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించడంలో మహేష్ బాబు మరో రికార్డు ఘనత సాధించారు. తాజాగా ఉచిత గుండె ఆపరేషన్ల సంఖ్య 5000 మందికి చేరడంతో… నిజంగా” చిన్నపిల్లల పాలిట దేవుడివి బాబు” అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మహేష్ బాబు ను ప్రశంసిస్తున్నారు. సాధారణంగా గుండె ఆపరేషన్లు అంటే లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుంది. అలాంటిది వైద్యం చేయించుకోలేనటువంటి నిరుపేదల పిల్లలకు మహేష్ బాబు ఫౌండేషన్ లో ఉచితంగా ఆపరేషన్లు చేస్తుండడం పట్ల ప్రజలు మహేష్ బాబును దేవుడితో పోల్చుతున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారంటే దానికి కారణం మహేష్ బాబు. సినిమాలలో మహేష్ బాబుది నటన కానీ రియల్ లైఫ్ లో హీరో మహేష్ బాబుది చాలా మంచి హృదయమని, నిరుపేదలకు అందిస్తున్న చేయూతకు ప్రశంసలు వెలువడుతున్నాయి. ఎవరైతే నిరుపేదలు వైద్యం చేయించుకోలేక సతమతమవుతుంటారో వెంటనే మహేష్ బాబు ఫౌండేషన్ లో నమోదు చేసుకోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : స్థానిక సంస్థల ఎన్నికల పోటీ పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Read also : వ్యవసాయం పై విద్యార్థులు కు అవగాహన కార్యక్రమం