జాతీయం

మహాకుంభమేళా విజయవంతమైంది - అసౌకర్యం కలిగుంటే క్షమించాలన్న ప్రధాని

మహాకుంభమేళా… ఒక అద్భుత ఘట్టం. 144 ఏళ్లకు ఒకసారి జరిగే అతిపెద్ద జాతర. ఈ మహాఅద్భుత కార్యక్రమం… నిన్న (బుధవారం) మహాశివరాత్రితో ముగిసింది. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే అద్భుత ఘట్టంలో… కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో సుమారు 70 కోట్ల మంది పాల్గొన్నట్టు సమాచారం.

మహాకుంభమేళా ముగిసిన సందర్శంగా ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. మహాకుంభమేళా ముగిసింది… ఐక్యత అనే మహాయజ్ఞం పూర్తయిందని తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులభం కాదని… అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఉత్తప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను ప్రశంసించారు. యోగీ నాయకత్వంలో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసి… ఈ ఐక్యత మహాకుంభ్‌ను విజయవంతం చేశారన్నారు. తమ పూజలో ఏదైనా లోపం ఉంటే.. దయచేసి క్షమించమని గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నానని అన్నారు ప్రధాని. భక్తులకు సేవ చేయడంలో విఫలమైతే… ప్రజలు తనను క్షమించాలని కోరారాయన.

45 రోజులుగా… దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది మహాకుంభమేళాకు తరలివచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారన్నారు. అంత మంది తరలిరావడంతో.. చాలా సంతోషంగా అనిపించదన్నారు. ముఖ్యంగా యువత… మహాకుంభమేళాకు తరలిరావడం… ఒక పెద్ద సందేశమని అన్నారు ప్రధాని. యువతరం మన సంప్రదాయాలను, సంస్కృతికి వారధులని రుజువైందన్నారు. మహాకుంభమేళా మహాశివరాత్రి నాడు పరిపూర్ణమైంది. గంగా మాత నిరంతరంగా ప్రవహిస్తున్నట్టే… ఆధ్యాత్మిక చైతన్యం, మహాకుంభమేళా ఐక్యత… నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు మోడీ.

జనవరం 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరిగింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖల దగ్గర నుంచి సామాన్య జనం కూడా ఈ కుంభమేళాలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని మోడీ కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. గంగా మాతకు పూజలు చేశారు.

  1. నేటితో ముగుస్తున్న మహాకుంభమేళా – ఎన్నికోట్ల మంది పుణ్యస్నానాలు చేశారో తెలుసా..?

  2. ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం-12 మంది ఆప్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

  3. చిన్నారులను మింగేస్తున్న బోరుబావులు-రాజస్థాన్‌లో ఐదేళ్ల చిన్నారి మృతి

  4. హిందువుల దగ్గర మాత్రమే శివరాత్రి పూజా సామాగ్రి కొనండి : రాజాసింగ్

  5. పీఎం కిసాన్‌ పేరుతో సైబర్‌ వల…ఏపీకే ఫైల్స్‌ పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button