ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

జగన్ ను చూడాలని ఎగబడ్డ కార్యకర్తలు.. తోపులాటలో ఇరుక్కుపోయిన రోజా?

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ బంగారుపాళ్యం పర్యటనకు వచ్చారు. అయితే ఈ పర్యటనలో భాగంగా జగన్ ని చూడడానికి చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని చూడడానికి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో జగన్ని చూస్తూ ఈలలు, కేకలు వేశారు. జగన్ తో ఎలాగైనా షేక్ హ్యాండ్ తీసుకోవడానికి చాలామంది కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడడంతో… ఇక్కడే ఉన్నటువంటి రోజా మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా తోపులాటలో ఇరుక్కుపోయి అవస్థలు పడ్డారు. కొద్దిసేపటి వరకు భారీగా తోపులాట జరగడంతో రోజా తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది… రోజా మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తీసుకెళ్లారు. తోపులాట జరిగిన సమయంలో వైసీపీ నేతలు రఘురాం మరియు సునీల్ కుమార్ మాజీ మంత్రి రోజాకు రక్షణగా పక్కనే నిలిచారు. పోలీస్ సిబ్బంది కార్యకర్తలను ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా లాభం లేకుండా పోయింది. ఇక్కడికి చేరుకున్న భారీ జనం జగన్ ను చూసి “సీఎం..సీఎం” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా ఈమధ్య జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ ఎత్తున ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గుముగూడి మరియు వస్తున్నారు. జగన్ను కాబోయే సీఎం అంటూ పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ నినాదాలు చేస్తున్నారు.

మామిడి రైతుల కోసం పోరాటం: వైఎస్‌ జగన్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం… ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ సీజ్‌

Back to top button