
గుండాల, క్రైమ్ మిర్రర్: అత్యాచారం కేసులో నిందితుడికి నల్గొండలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో నమోదైన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.గుండాల ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 43/2021గా భారతీయ శిక్షాస్మృతిలోని 376, 417, 420 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో వెల్మజాల గ్రామానికి చెందిన చొప్పరి వినోద్ కుమార్ (30), తండ్రి అబ్బయ్యను నిందితుడిగా పేర్కొన్నారు.
కేసు విచారణ పూర్తయిన అనంతరం అక్టోబర్ 9న నల్గొండ ప్రత్యేక సెషన్స్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎన్. రోజారమణి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. వర్తించే సెక్షన్ల కింద ఒక్కో సెక్షన్‌కు రూ.4 వేల చొప్పున జరిమానా కూడా విధించినట్లు గుండాల ఎస్ఐ వి. సైదులు తెలిపారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేపడతారని తెలిపారు.కేసు దర్యాప్తు, సాక్ష్యాధారాల సమర్పణ, న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ వాదనలు శిక్ష విధింపులో కీలక పాత్ర పోషించాయని పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడ చదవండి:
-
40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచిన ఆర్టీసీ డ్రైవర్!
-
పెళ్లయిన 12 గంటలకే వరుడు మృతి.. మామిడి తోటలో చెట్టుకు వేలాడుతూ మృతదేహం!
-
ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదని రైలు కింద పడి యువ జంట మృతి!
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో 45 రోజుల పసికందు మృతి!