
-
జనతా కాక్రోచ్ ఉద్యమంలో మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్
-
దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ముంబై పోలీసులు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశాన్ని అస్థిర పరచాలన్న ప్రయత్నాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. భారతీయ అంతర్గత రాజకీయాల్లో వేలు పెడుతున్న విదేశీ శక్తుల లింకులు బహిర్గతం అవుతున్నాయి. అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండి.. బాలీవుడ్ చిత్రాల్లో నటించిన అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. భారత ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ యాక్ట్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రాజకీయ నిరసనల్లో పాల్గొన్నందుకు గాను.. అక్టోబర్ 28 లోపు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ అధికారికంగా లీవ్ ఇండియా నోటీసులు జారీ చేశారు. ఒక విదేశీ పౌరుడు భారత గడ్డపై వచ్చి ఇక్కడి రాజ్యాంగ సంస్థలపై జరిగే వీధి పోరాటాల్లో భాగస్వామి కావడం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముంబైలో నిరసనల్లో…
ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 10న ఒక ఆందోళన జరిగింది. ఇందులో ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలంటూ జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో.. ఇమ్రాన్ ఖాన్ ను ముంబై పోలీసులు అప్పట్లోనే అదుపులోకి తీసుకున్నారు. దేశంలో ఒకవైపు అమెరికా నిధుల వివాదం నడుస్తుండగానే.. స్వయంగా అమెరికన్ పౌరుడైన ఒక నటుడు ఇలా భారత్ లో రాజ్యాంగబద్ధ సంస్థలను లక్ష్యంగా చేసుకుని.. రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టడం వెనుక లోతైన అంతర్జాతీయ అజెండా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బిజెపి నేత ఫిర్యాదుతో…
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎంపీ సోమయ్య తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక విదేశీయుడు కాక్రోచ్ పార్టీకి మద్దతుగా భారత గడ్డపై ఆందోళనలు, నిరసనల్ లో ఎలా పాల్గొంటారని నిలదీశారు. దీనిపై చట్టపరమైన పరిశీలనలు జరిపిన పోలీసులు.. ఫారినర్స్ ఆక్ట్ నిబంధనల ప్రకారం ఏ విదేశీ పౌరుడికి భారతదేశంలో రాజకీయ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనే హక్కు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. మన దేశ వీసా, నిబంధనలను ఉల్లంఘించి రాజకీయ వేదికపై హల్చల్ చేసినందుకు గాను ఆయనను వెంటనే దేశం విడిచి వెళ్లాలని సామన్లు జారీచేశారు. తదుపరి పరిపాలనా పరమైన చర్యలను ముమ్మరం చేశారు. ఈ పరిణామం సాధారణ వీసా ఉల్లంఘన మాత్రమే కాదని.. భారత్ లో అల్లకల్లోలం సృష్టించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలో భాగమే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇవి కూడ చదవండి:
-
పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు.. అప్పూ మరణంపై డాక్టర్ కీలక వ్యాఖ్యలు!
-
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. పాఠశాల పైకప్పు కూలి 22 మంది మృతి!
-
కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నిధులా? మేరీ మిల్బెన్కు అభిజీత్ దీప్కే స్ట్రాంగ్ కౌంటర్!
-
భారతీయ ఇతిహాస చిత్రాల్లో రామయణం ఒకటి…! కాని హలీవుడ్ స్తాయిలో విజువల్స్ లేవంటూ విమర్శలు…