
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో ఒక శకం ముగిసింది. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 37వ ఏట ఈ కీలక నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే భవిష్యత్తులో కేవలం ఒక ప్యూర్ ప్లేయర్‌గా మాత్రమే జట్టులో కొనసాగుతానని, కెప్టెన్‌గా తన డ్యూటీని పరిపూర్ణంగా నిర్వర్తించానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా అనేక అపురూప విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా 2025లో వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఆమె నాయకత్వ పాత్ర ఎంతో కీలకం. అలాగే ఇటీవ ల జరిగిన ఏషియన్ గేమ్స్‌లోనూ భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించిపెట్టి చరిత్ర సృష్టించారు. దేశం గర్వించదగ్గ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఆమె, స్వచ్ఛందంగానే ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం విశేషం. కాగా, హర్మన్‌ప్రీత్ స్థానంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధానను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
గ్రీన్ టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు
విజయ్-రష్మిక ప్రేమకథలో అసలు ట్విస్ట్.. ప్రపోజల్ లేకుండానే పెళ్లి వరకు!