తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ స్కూల్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏడవ తరగతి చదివే విద్యార్థి ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపుతుంది. ఈ సంఘటన హైదరాబాదులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక అసలు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read More : తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టిన అల్లరి నరేష్?
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్ హాస్టల్ లో ఏడో తరగతి చదివే లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి అందరు పడుకున్న సమయంలో లోహిత్ అనే విద్యార్థి హాస్టల్ రూమ్ లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక వెంటనే హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలనేవి తెలియలేదు.
Read More : రేపు మరో వాయుగుండం!… ఏపీలో నాన్ స్టాప్ వర్షాలే?
ఇప్పటికే హైదరాబాదులోని హయత్ నగర్ లో ఉన్నటువంటి నారాయణ స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ విషయాన్ని ఆత్మహత్య చేసుకున్న లోహిత్ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో నారాయణ స్కూల్ వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థి ఎందుకు చనిపోయారు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.