జాతీయంతెలంగాణ

ప్రధాన మంత్రి మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. మోదీ, అమిత్ షాలకి పలు వినతి పత్రాల అందచేత!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా‌,  తదితర మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. విభజన చట్టంలోని పలు అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని.. విభజన హామీలను త్వరగా నెరవేర్చటమే కాకుండా.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి బృందం.. కేంద్రానికి విజ్ఞప్తులు చేసింది. ఈ మేరకు మోదీకి, అమిత్ షాకి పలు వినతి పత్రాలు సమర్పించింది. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాలకు సంబంధించిన వివరాలు మీడియాకు వివరించారు.

Read Also : ఫ్రీ బస్సు పథకం వల్ల టీజీఎస్ఆర్టీసీకి 2500 కోట్ల నష్టం.. ఒక్క పైసా కూడా ఇవ్వని సర్కార్!!

రాష్ట్ర అభివృద్ధితో పాటు విభజన చట్టంలో ఉన్న పు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.  భేటీల్లో కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వివరించారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని ప్రధాని మోదీని కోరినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి కేటాయింపులు చేయాలని, ప్రతి జిల్లాకు నవోదయ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ రంగంలో తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరామన్నారు. ఎక్స్చేంజ్ కింద డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తంగా ఒకే జాతీయ రహదారి నెంబర్ ఇవ్వాలని.. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినట్టు తెలిపారు.

Also Read : కేజీ టు పీజీ విద్యాసంస్థల దేశవ్యాప్త బందు విజయవంతం..

డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కేంద్రం సహకారం అందించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఐపీఎస్ క్యాడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. మరోవైపు.. భద్రాచలం పరిధిలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్టు భట్టి విక్రమార్క వివరించారు. కాగా.. తాము చేసిన అన్ని విజ్ఞప్తులకు ప్రధాని మోదీ, అమిత్ షా.. సానుకూలంగా స్పందించారని.. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత సమస్యలపై చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టు అమిత్ షాకు వివరించామని.. కేంద్రం వైపు నుంచి కూడా సహకారం ఉండాలని కోరినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీని స్వయంగా కేసీఆరే టార్చి లైట్ వేసుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : 

  1. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం.. గడువు ముగిసిందని తిప్పి పంపిన బ్యాంకు అధికారులు!!!
  2. బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన వరల్డ్ ఛాంపియన్స్‌
  3. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా??.. పార్టీ మారేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే!!
  4. ములుగు జిల్లాను రామప్ప ములుగు జిల్లాగా ప్రకటించాలి.. రామప్ప పరిరక్షణ కమిటీ
  5. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!

Related Articles

Back to top button