Telangana

‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. రూ.97 కోట్లు కేటాయించారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Read Also : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్‌బై

ఇందుకోసం రూ. 4.07 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం, తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది.

ఇవి కూడా చదవండి : 

  1. ఎవ్వర్నీ వదలం, విచారణ జరిపిస్తాం.. యాదాద్రి పున‌ర్నిర్మాణంలోనూ అవినీతి : మంత్రి కోమటిరెడ్డి
  2. లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ తొలి జాబితాపై కసరత్తు.. రేపు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ భేటీ
  3. పార్కుల్లో అనైతిక పనులు.. ఆరు జంటలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  4. సీఎం హెచ్చరించినా వినిపించుకోలేదు.. ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.