NalgondaTelangana

అన్నదాతలకు అండగా రంగంలోకి గులాబీ బాస్.. రోడ్ మ్యాప్ రెడీ!!!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కాలువకు నీరు వదలకపోవటం, భూగర్భజలాలు సైతం తగ్గిపోవటంతో సరిపడా తడులు అందక.. చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే నీళ్లు వదలాలంటూ రైతన్నలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతన్నలకు ధైర్యం చెప్తున్నారు. కాగా.. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షునిగా కష్టాల్లో ఉన్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎండిన పంటలను పరిశీలించి అన్నదాతల చెంతకు కేసీఆర్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. నల్గొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన చేయనున్నారు.

Read Also : దేశానికి ఏం చేశారని మూడోసారి మోదీకి ఓటు వేయాలి… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. మొదటగా నల్గొండ జిల్లాలోని ముషంపల్లికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఏప్రిల్ మొదటి వారం తరువాత కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు నియోజ కవర్గ పరిధిలో పర్యటించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే.. గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయని ఇప్పటికే కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం. అయితే.. ఈ క్షేత్రస్థాయి పరిశీలనకు అత్యధికంగా బోర్లు వేసి నష్టపోయిన నల్గొండ మండలం ముషంపల్లి గ్రామం నుంచే ఈ పరిశీలన మొదలు పెట్టే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

  1. SRH vs MI ఐపీఎల్ మ్యాచ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు TSRTC గుడ్‌న్యూస్
  2. పైన పటారం.. లోన లొటారం.. నిర్లక్ష్యానికి పరాకాష్టలో మిషన్ భగీరథ పనులు!!!
  3. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యూడిషియల్ రిమాండ్
  4. తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. త్వరలోనే పట్టాలెక్కనున్న డోర్నకల్‌-గద్వాల రైలు మార్గం ప్రాజెక్టు!!!
  5. హిందూ మహిళకు అంతిమ సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం మహిళ..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.