తెలంగాణ

రేవంత్ దొంగ.. వాడి నాలుక చీరేస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్

తెలంగాణ దివాళా తీసిందన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు మాస్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడికి పోయినా నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటుండు.. దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారని అన్నారు. అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కాని.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్ అని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నావా? సర్కస్ నడుపుతున్నావా? అని కేటీఆర్ నిలదీశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు .8,29 లక్షల కోట్లు అని చెపుతున్నాడని విమర్శించారు. పూటకో లెక్క మాట్లాడుతూ, సంఖ్య పెంచుతున్నాడు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అసలు అప్పు రూ.4 లక్షల 17 వేల కోట్లు మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కలిపి నెలకు చెల్లించే అప్పు కేవలం రూ.2000 కోట్లు మాత్రమే అని.. కాగ్ కూడా ఇదే లెక్క చెప్పిందన్నారు కేటీఆర్. చెప్పులు ఎత్తుకపోవడానికి వేరే పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు.. ఢిల్లీకి మూటలు మోయడానికి పోతే దొంగ లెక్కనే చూస్తారని ఆయన సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్స్, లగ్జరీ ప్రయాణాలు అన్ని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు. నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని ధ్వజమెత్తారు.

కోసుకొని తినడానికి నువేమన్నా మామిడి పండా.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు, దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సవాల్ చేశారు. చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అంటూ కేటీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button