Telangana

ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, హరీశ్‌ను ముద్దాయిలుగా చేర్చండి.. రఘునందన్ రావు

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రఘునందన్ రావు తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, దుబ్బాక ఎన్నికల ఇంచార్జీ హరీష్ రావు, కలెక్టర్ వెంకట రామిరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ డివైస్ కొనుగోలు చేసింది ఎవరని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Also Read : అడుగంటిన కృష్ణమ్మ… డెడ్‌ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం

ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డీజీపీని రఘునందన్ రావు కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటకలో కుమార స్వామికి లబ్ది చేకూరేలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అందేలా శ్రీరాములు యాదవ్ నంబర్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు చెప్పాలని రఘునందన్ కోరారు. సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫోన్లను వదల్లేదన్నారు. వారిలో కొందరికి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూల్ చేశారని ఆరోపించారు. మాజీమంత్రి హరీశ్ రావు బినామీ చానెల్ ఓనర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని రఘునందన్ వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి : 

  1. అనర్హత వేటు వేయాలంటూ దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్.. ఎంపీ ఎన్నికల వేళ షాక్ తప్పదా..?
  2. తెలంగాణలో మరోసారి తెరపైకి జిల్లాల విభజన.. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు..?
  3. బిజాపూర్‌లో భీకర ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!!!
  4. మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ!!
  5. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ లొల్లి… సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్న కొందరు నేతలు!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.