Telangana

ఐఏఎస్‌ల బదిలీలు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మళ్లీ ట్రాన్స్‌ఫర్.. ఈసారి ఏ శాఖకంటే..?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో బదిలీ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్న రేవంత్ సర్కార్.. భారీ ఎత్తున బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను భారీగా ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన సర్కారు.. ఐఎఎస్‌లను కూడా దశలవారీగా బదిలీ చేస్తోంది. తాజాగా.. మరికొంత మందికి స్థానచలనం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేసింది. కాగా.. ఆ స్థానంలో మిక్కిలినేని మను చౌదరిని నియమించింది. ఇక జనగామ జిల్లా నూతన కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్‌ను నియమించింది.

Read Also : ఢిల్లీ లిక్కర్ స్కాంలో షాకింగ్ ట్విస్ట్.. నిందితురాలిగా కవిత పేరు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..!?

మరోవైపు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్‌కు కూడా రేవంత్ సర్కార్ స్థాన చలనం కల్పించింది. శైలజా రామయ్యర్‌ను.. దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పలు శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్చించిన మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరగా యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్చించారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. శైలజా రామయ్యర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. కాగా.. రెండు నెలల్లోనే మరోసారి శైలజా రామయ్యర్‌ను మళ్లీ బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి : 

  1. నాగార్జునసాగర్‌ దగ్గర కనిపించిన అరుదైన దృశ్యం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
  2. మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష.. సీఎం రేవంత్‌రెడ్డి
  3. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు.. BRS నుంచి వచ్చిన ‘ఆ నలుగురికి’ ఫిక్స్??
  4. మేడారం సమక్క – సారమ్మను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా
  5. ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే… ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.