తెలంగాణ

ఘనంగా జరిగిన మహనీయుడి జయంతి వేడుకలు

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 133వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆయన సేవలను స్మరించుకొని అంబేడ్కర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అతి కొద్దిమందిలో అంబేడ్కర్‌ ఒకరని, ఐక్యరాజ్యసమితితో పాటు 132 దేశాల్లో అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని నేతలు ఆయన కీర్తిని చాటారు. ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు లభించడానికి, చట్టం ముందు అందరూ సమానులేనని చాటడానికి, అస్పృశ్యత నేరం అన్న అంశాన్ని చట్టబద్ధం చేయడానికి ఆయన చేసిన కృషి మూల కారణమని పేర్కొన్నారు. తరతరాలుగా మతం పేరుతో బూజు పట్టిన భావాలతో తోటి వారిని ముఖ్యంగా మహిళలను విచక్షణకు, అవమానాలకు, అన్యాయానికి, అత్యాచారాలకు గురి చేస్తున్న వ్యవస్థపై పోరాటంలో భాగంగా ఆయన హిందూ కోడ్‌ బిల్లును రూపొందించారన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చల్ల రమేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తులసి మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మడక ప్రతాప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఓడేటి లక్ష్మారెడ్డి, యెల్లంకి రవీందర్, ములుకళ్ల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు తూడిచర్ల దుర్గయ్య మరియూ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Back to top button