ఆంధ్ర ప్రదేశ్

మంత్రి నారాయణ వర్సెస్‌ ఎమ్మెల్యేలు - నెల్లూరు టీడీపీలో కోల్డ్‌వార్‌

మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. ముఖ్యమంత్రి అండదండలు మెండుగా ఉన్నవాడు. అయినా… ఆయన భయపడుతున్నారా..? సొంత జిల్లా ఎమ్మెల్యేలే ఆయన్ను భయపడెతున్నారా..? అంటే పరిస్థితి అలానే ఉంది. అందుకే… నారాయణ జిల్లాలో తన నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదట. మంత్రిగా ఉండి నియోజకవర్గానికే పరిమితం కావడంపై నారాయణపై విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ ఏం చేస్తాం.. పరిస్థితి అలాంటిది అని సరిపెట్టుకుంటున్నారట నారాయణ.

ఇంతకీ ఏం జరిగిందంటే… మంత్రి నారాయణకు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అస్సలు పడటంలేదట. నెల్లూరు నగర పాలక సంస్థ విషయంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. తన నియోజకవర్గం పనులు తన ఆధ్వర్యంలోనే జరగాలని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అనుకుంటున్నారట. అయితే… మంత్రి నారాయణ మాత్రం… నెల్లూరు నగరానికి సంబంధించిన పనులు విభజించేందుకు ఇష్టపడటంలేదు. నెల్లూరు నగరమంతా దగ్గరుండి అభివృద్ధి పనులు చూసుకుంటున్నారట నారాయణ. ఇది… ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి అస్సలు మింగుడుపడటంలేదని సమాచారం. అందుకే… శ్రీధర్‌రెడ్డి అలక బూనారట. మంత్రి నారాయణ నిర్వహిస్తున్న సమీక్షలకు ఆయన వెళ్లకపోవడానికి కూడా కారణం ఇదే అని తెలుస్తోంది.


Also Read : గోరంట్ల మాధవ్ కు సపర్యలు.. 12 మంజి పోలీసు అధికారులపై వేటు


కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విషయం పక్కనపెడితే… జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలతోనూ మంత్రి నారాయణకు మంచి సంబంధాలు లేవని సమాచారం. ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటతోపాటు కావలి, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీలో మంత్రి నారాయణ పర్యటించిన దాఖలాలు లేవంటున్నారు. మంత్రిగా ఉన్నా… ఈ ప్రాంతాల అభివృద్ధిని పక్కనపడేశారట నారాయణ. కేవలం నెల్లూరు సిటీ డెవలప్‌మెంట్‌పైనే దృష్టిపెట్టారట. దీంతో… ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మంత్రి నారాయణతో ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారట. అయితే… జిల్లా మంత్రిగా ఉన్న నారాయణ.. ఆ నియోజకవర్గాల్లో ఎందుకు పర్యటించడంలేదు..? అన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నారాయణ భయపడుతున్నారని కొందరు అంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు..? అన్నదానిపై క్లారిటీ లేదు. మొత్తానికి నెల్లూరులో మంత్రి వర్సెస్‌ ఎమ్మెల్యేలు అన్నట్టు కోల్డ్‌వార్‌ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Back to top button