
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- ధర్మశాల వేదికగా నిన్న పంజాబ్ మరియు ఢిల్లీల మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ కేవలం ఫ్లడ్లైట్ల క కారణంగానే ఆగిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అసలు విషయం తెలిస్తే నిన్న స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా షాక్ అవుతారు. సాంకేతిక సమస్యల కారణంగా మ్యాచు రద్దయిందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా స్టేడియం నుంచి పంపించేశారు. కానీ ప్రతి ఒక్కరికి స్టేడియం బయటకు వెళ్ళగానే అసలు నిజం అర్థమైంది. నిన్న రాత్రి పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య దాడులు ఎక్కువ అవడంతో మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేశారు. స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకులను చాలా తెలివిగా ఎటువంటి భయాందోళన లేకుండా చాలా తెలివిగా బీసీసీఐ బయటకు పంపించేసింది. పంజాబ్ కింగ్స్ మొదటి బ్యాటింగ్లో 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ నిలిచిపోయింది.
ప్రేక్షకులను ఎలాగైనా బయటికి పంపించాలనే ఆలోచనతో.. ఇటువంటి ఒత్తిడి పెట్టకుండా ముందుగా స్టేడియం లోని లైట్లను ఆపారు. సాంకేతిక కారణం వల్ల ఫ్లడ్లైట్లు వెలగడం లేదని మ్యాచ్ను రద్దుచేసి.. స్టేడియంలోని ప్రేక్షకులను ఒక్కొక్కరిగా బయటకు పంపించేశారు. అయితే ఒకవేళ ముందుగానే దాడుల తరుణంలోనే మిమ్మల్ని అందరిని కూడా బయటికి పంపిస్తున్నామని ప్రేక్షకులకు చెప్పి ఉంటే… ప్రేక్షకులలో భయం మొదలుకొని ఎలా పడితే అలా పరిగెత్తడం ద్వారా తొక్కేసిలాట జరిగితే పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా పోయేవి అని హిమాచల్ క్రికెట్ సంఘం అధికారులు ఒకరు చెప్పుకొచ్చారు. ఇక ప్రేక్షకులను పంపించడంతోపాటుగా క్రికెటర్లను కూడా అత్యంత జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. క్రికెట్ ప్లేయర్లను విమానంలో కాకుండా కేవలం రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రత కారణాల దృశ్య ధర్మశాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో విమానాశ్రయాలను మూసి వేయడం జరిగింది.
ఇక ఐపీఎల్ విషయానికి వస్తే … పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ జరగకపోవచ్చు అని చాలామంది చెబుతున్నారు. ఐపీఎల్ లో కేవలం మన భారతదేశ ఆటగాళ్లు కాకుండా ఇతర దేశస్తులు కూడా ఉండడం… వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ పరిగణలోకి తీసుకొని ఐపీఎల్ ను రద్దు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి తరుణంలో ఐపీఎల్ జరపడం అనేది అసాధ్యమని బీసీసీఐ కూడా భావిస్తుంది. ఈ ఐపిఎల్ సీజన్ కొనసాగించడం కంటే ఆటగాళ్ల భద్రతే ముఖ్యమని భావిస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఐపిఎల్ కొనసాగించడం పై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.