
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7 రోజులు పాటు శక్తి తుఫాన్ ముప్పుగా మారనుంది. నైరుతి రుతుపవనాల వల్ల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోతున్న ఏడు ఏడు రోజులు కూడా తెలుగు రాష్ట్రాలపై భారీ తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాన్ కు ‘ శక్తి తుఫాన్’ గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, శ్రీకాకుళం, కోనసీమ వంటి జిల్లాలో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక మిగిలిన రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ అధికారులు అంచనా చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్ కి రానున్న మరో మూడు రోజుల పాటు నుండి వారం రోజులు పాటుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలియజేశారు. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు పాటు తీవ్ర తుఫాను ప్రభావం ఉండనుంది అని తెలిపింది.
మరోవైపు తెలంగాణలో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఉదయం పూట వేడి, సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుండి వర్షాలు పడుతూ ప్రజలకు కష్టాలను కొని తెస్తున్నాయి. భద్రాద్రి, అశ్వారావుపేట వంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి జిల్లాలలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక హైదరాబాద్ ప్రాంత పరిధిలో కాస్త ఉక్కుపోతా… కాస్త వర్షాలు పడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాబట్టి ఈ తుఫాన్ తో ప్రజలకు కాస్త ఇబ్బందులకు గురవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ శక్తి తుఫాను రెండు తెలుగు రాష్ట్రాలకు ముప్పు చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.