తెలంగాణ

రేషన్‌కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ అవసరం లేదు

హైదరాబాద్‌(క్రైమ్ మిర్రర్):-రాజీవ్‌ యువవికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టం చేశారు.. ఈ పథకం కింద ఇప్పటివరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించామని గురువారం ఒక ప్రకటనలో వివరించారు. ‘‘రేషన్‌కార్డు, ఆహార భద్రత కార్డు లేని అభ్యర్థులు మాత్రమే మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం నంబరును ఆన్‌లైన్ లో నమోదు చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందన్నారు. 2016 నుంచి మీసేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్న అభ్యర్థులు ఆ పత్రాల నంబరుతో దరఖాస్తు చేసుకోవచ్చని, కొత్త కుల ధ్రువీకరణ పత్రానికి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.. మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

రేవంత్ అమ్మిన భూమిని కొనవద్దు.. మేం తిరిగి లాగేసుకుంటం

మంబాపూర్ పేపర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ఆ భూములు నీ అయ్య జాగీరా.. సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన జేజమ్మ

Back to top button