KhammamTelangana

వృద్ధాప్యంలో తల్లిన పట్టించుకోని కొడుకు.. కుమారుడు, కోడలికి జైలు శిక్ష!!!

క్రైమ్ మిర్రర్, ఖమ్మం ప్రతినిధి : పిల్లల కోసం తమ సర్వస్వం దారపోస్తారు తల్లిదండ్రులు. వారు తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండేందుకు ఎండా.. వాన లెక్క చేయకుండా కష్టపడి పోషిస్తారు. తమ కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు నింపుతారు. తాము పాత బట్టలు వేసుకొని అయినా.. పిల్లలకు మాత్రం మంచి బట్టలు కొనిస్తారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తమ రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అయినా.. చాలా మంది పుత్రరత్నాలు తలిదండ్రులను చులకనగా చూస్తారు. చిన్నప్పుడు తమను లాలించి.. పాలించిన తల్లిదండ్రులను వారి చివరదశలో అంటరానివారిగా చూస్తారు. వారికి ఓ పూట అన్నం పెట్టేందుకు వంతులేసుకుంటారు. మరికొందరైతే.. వారిని భారంగా భావించి వృద్ధాశ్రమాల్లోనూ చేర్పిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అటువంటి ఘటనే చోటు చేసుకుంది. కన్నతల్లి పోషణ బాధ్యత చూడలేని ఓ కుమారుడికి, అతని భార్యకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

Read Also : సీఎం హెచ్చరించినా వినిపించుకోలేదు.. ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

దీంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన చుంచుపల్లి మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంనగర్‌కు చెందిన వృద్ధురాలు ఊట్ల వెంకటరమణకు కుమారుడు రవిశంకర్‌, కోడలు నాగలక్ష్మి ఉన్నారు. వయసు మీదపడినా తన బాగోగులు చూడటం లేదని, కనీసం ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్నారని 2022లో కొత్తగూడెం కోర్టును వెంకటరమణ ఆశ్రయించింది. దీంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లి బాగోగులు సక్రమంగా చూసుకోవాలని రవిశంకర్‌ను కొత్తగూడెం న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాతా ఆయనలో ఎలాంటి మార్పురాలేదు. ఎప్పటిలాగే తల్లిని ఇంట్లోకి రాకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆమె కుమారుడు, కోడలిపై కేసు నమోదు చేసి భద్రాచలం పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించటంతో పోలీసులు జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి : 

  1. నేడు జనం నుంచి వనంలోకి వనదేవతలు.. మూడోరోజు బారులు తీరిన భక్తజనం
  2. భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి.. నేడు సీఎం సుదీర్ఘ సమీక్ష
  3. ఐఏఎస్‌ల బదిలీలు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మళ్లీ ట్రాన్స్‌ఫర్.. ఈసారి ఏ శాఖకంటే..?
  4. ఢిల్లీ లిక్కర్ స్కాంలో షాకింగ్ ట్విస్ట్.. నిందితురాలిగా కవిత పేరు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..!?
  5. నాగార్జునసాగర్‌ దగ్గర కనిపించిన అరుదైన దృశ్యం.. చూసేందుకు ఎగబడుతున్న జనం

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.